మాస శివరాత్రి సందర్భంగ శృంగేరి ఆలయంలో మహ లింగాభిషేకం.

Spread the love

శంషాబాద్. ఆగస్టు 11 . తెలంగాణ కానుక.

మాస శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్వాల్ గూడ డివిజన్ ఊట్పల్లి శృంగేరి ఆలయంలో మహా లింగ అభిషేకం నిర్వహించారు. ప్రతి మహాశివరాత్రి రోజున చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల చే మహా లింగాభిషేకం నిర్వహించడం జరుగుతుందని ఆలయ మేనేజర్ సోమయాజుల శ్రీనివాసులు తెలిపారు. ఆలయ పూజారి హిమాన్షు భరద్వాజ్ ఆధ్వర్యంలో పండితులు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయాజుల శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రావణమాసం సందర్భంగా నాలుగు శుక్రవారాలు ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండవ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *