శంషాబాద్ . ఆగస్టు 11 . తెలంగాణ కానుక. ఆషాడ మాస బోనాల సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ మాజీ జెడ్పిటిసి నీరటి తన్వి రాజు ముదిరాజ్ ఘన్సిమియా గూడా గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్నారు . ఆలయ ఈవో దేవేందర్ రెడ్డి, అర్చకులు పగుడాల శ్రీశైలం, మడపతి మల్లికార్జున్, ఆలయ రికార్డు అసిస్టెంట్ మహిపాల్ యాదవ్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గుగ్గిళ్ళ రామనాథ ముదిరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమర్రి మహేందర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ దేవిక జగన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పూసలపాటి యాదయ్య గౌడ్, ఎన్ ఎ సి ఐ నాయకుడు జిల్లా ఆనంద్ ముదిరాజ్, దెపల్లె మల్లేష్ గౌడ్, కిట్టు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
ఘాన్సీమియా గూడ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నీరటి తన్వి రాజు ముదిరాజ్,
