ఖమ్మం,ఆగస్టు,11 తెలంగాణ కానుక ప్రతి నిధి :
పిసిపిఎన్డిటి చట్టం 1994 అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా డి రామారావు అధ్యక్షతన ఖమ్మంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు నమోదు పునరుద్ధరణ ఫారం ఎఫ్ నిర్వహణ రికార్డుల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టడంతో పాటు చట్ట నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ ఓ డాక్టర్ డి రామారావు సూచించారు ఆడ శిశువుల పట్ల వివక్షను నివారించి బాలికల జననాలను ప్రోత్సహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డా వేణుగోపాల్ రెడ్డి డా బిందు శ్రీ డా లక్ష్మీనారాయణ
డా మోతియా స్టాటిస్టికల్ ఆఫీసర్ వీరయ్య డిప్యూటీ డెమో వెంకటేశ్వరరాజు డీడీఎం నాగరాజు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డా వేణు మాధవరావు
డా ప్రదీప్ బాబు
డా కె. మాధవి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు ఐఎంఏ ఎన్జీవో ప్రతినిధులు ఎం కుమ్మిదిని దేవి జాగృతి ఎన్జీవో సెక్రటరీ ఎం కోటేశ్వరరావు ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం
