తాండూర్, తెలంగాణ కానుక :
భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులుగా నియమి తులైన రమేశ్ కుమార్ హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్షులు రామ్ చందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర నాయకత్వం అభినందనలు తెలియజేసింది. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ ముఖ్య నేతలు పాల్గొని నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం లో ముఖ్యనాయకులు ఉద్దేశించి మాట్లాడతూ..
పార్టీ బలోపేతమే ధ్యేయమ ని.. జిల్లాలో బీజేపీని మ రింత క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
సమిష్టి కృషితో విజయాలు సాధ్యం అవుతాయని వివరించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన పరిగి, వికారాబాద్, తాండూర్ లలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, అందరి భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నాయకులు పునరుద్ఘా టించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్ణం ప్రహ్లాద రావు, మాధవరెడ్డి, శివరాజ్, గిరామోని శ్రీనివాస్, శంకర్ నాయక్, సాహు, శ్రీలత, శ్రీధర్ రెడ్డి, వీబీ రెడ్డి, మారుతీ కిరణ్, మిట్ట పరమేశ్వర్, వడ్ల నందు, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, బాలేషం, విజయ్ కృష్ణ ముదిరాజ్, భద్రశ్వర్, కేశవ్లు, యాదవ్, నాగారం మల్లేశం, శిరీష, రాజేందర్ రెడ్డి, వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
