ఖమ్మం తెలంగాణ కానుక
తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విశిష్ట పాత్ర పోషించారని ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సేవకు అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు ప్రజా ప్రతినిధిగా పార్టీ నాయకుడిగా ఆయన చూపిన నిబద్ధత అంకితభావం బీఆర్ఎస్ శ్రేణులకు ఆదర్శప్రాయమని తెలిపారు ఆయన మరణం పార్టీకి, తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని అన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు
