దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రు నివాళి

Spread the love

హన్మకొండ తెలంగాణ కానుక

తెలంగాణ మలి ఉద్యమంలో 2001 నుండి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన నిఖార్సయిన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని రామకృష్ణ సేవాసమితి ,అధ్యక్షుడు,కటంగూరి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
అతను ఒక ప్రజల మనిషి. అతడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా కళాజాత బృందాలతో కలిసి ప్రజలను చైతన్యం చేయుటలో తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మేము కలిసి పనిచేశాం. నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజల సంక్షేమం కోసమే పనిచేసిన అమరుడు. అతడి ఆకస్మిక మరణం అతడి కుటుంబానికి, ఆత్మీయులకు తీరని లోటని పేర్కొన్నారు.
హనుమకొండ శ్రీరామకృష్ణ సేవా సమితి పక్షాన అతడి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *