నూతన ఇన్స్పెక్టర్ వెంకటేష్ ను ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు

Spread the love

రాజేంద్రనగర్ తెలంగాణ కానుక

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా నియమితులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్.వెంకటేశ్ సార్ ను శుక్రవారం భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి పొన్నమోని మల్లేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్ సెక్రెటరీ సాబాద విజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు కాకులారం కృష్ణ కిట్టు, అత్తాపూర్ డివిజన్ పూర్వ అధ్యక్షులు స్టార్ చిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *