గంధంగూడ ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీలో అధ్వాన్నంగా మారిన రోడ్లు వెంటనే మరమ్మతులు చేపట్టాలి: రావుల కోళ్ల నాగరాజ్

Spread the love

బండ్లగూడ తెలంగాణ కానుక

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీ కి వెళ్లే రహదారులు అద్వానంగా తయారయ్యాయి రోడ్లపై గుంతల ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల కోళ్ల నాగరాజ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి నాయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఫీల్డ్ గంధంగూడ ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీలోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ పూర్తిగా గుంతలమయంగా మారి రోడ్లపై వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఎన్నిసార్లు జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

121, 122, 123 డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వెంటనే ప్యాచ్ వర్క్ చేపట్టి, శాశ్వత రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి భారీ ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించి రోడ్లకు మరమ్మతులు ప్యాచ్ వర్క్ చేసి, శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలు రోజురోజుకూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *