పురోహిత అర్చక రత్న బిరుదుతో ఏల రాము రామానుజాచార్యకు ఘన సత్కారం

Spread the love

కుత్బుల్లాపూర్ జూలై 31 తెలంగాణ కానుక :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని చింతల్ పురోహితునికి అరుదైన పురోహిత అర్చక రత్న బిరుదుతో ఏల రాము రామానుజాచార్యకు ఘన సత్కారం లభించింది. అఖిల భారత పద్మ బ్రాహ్మణ సంఘం 28వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల తమిళనాడు లోని శ్రీరంగంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గిరి గుట్ట చింతల్ ద్వారకానగర్కు చెందిన ప్రముఖ పురోహితుడు ఏల. రాము రామానుజాచార్యకు ఆయన అందిస్తున్న విశిష్టమైన పౌరోహిత్య, ఆధ్యాత్మిక సేవలను గుర్తించి పురోహిత అర్చక రత్న బిరుదుతో సత్కరిం చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరైన అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం జాతీయ అధ్యక్షులు గుర్రం బొజ్జయ్య శాస్త్రి, తెలంగాణ రాష్ట్ర అధ్య క్షులు రుద్ర పాండు శాస్త్రి, ప్రముఖ పండితులు సీత వంశీ భట్టాచా ర్యులు మాట్లాడుతూ రాము రామానుజాచార్యులు ఎన్నో సంవత్సరా లుగా పౌరోహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తూ ధార్మిక విలువ లను సమాజంలో పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీ యమని కొనియాడారు. ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల కుటుంబ సభ్యులు, శిష్యులు, భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ రాము రామానుజాచార్యులకు అభినందనలు తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *