మత్స్యరంగ అభివృద్ధికి రూ.2.208 కోట్ల నిధులు విడుదల

Spread the love

హైదరాబాద్, తెలంగాణ కానుక

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై)
కింద దేశంలోని మత్స్యకారుల సంక్షేమం, ఆక్వాకల్చర్ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,208.74 కోట్లు నిదులు విడుదల చేయడం పట్ల తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ మత్స్య విభాగం రాష్ట్ర కో కన్వీనర్ ఎల్.వి.రమణ ముదిరాజ్ హర్షం ప్రకటించారు. గురువారం హైదరాబాద్ నగరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్ల నీలి విప్లవం (బ్లూ రెవల్యూషన్) మరింత బలపడిందని అన్నారు. దేశంలో మత్స్య ఉత్పత్తి 141.64 లక్షల టన్నుల నుండి 197.75 లక్షల టన్నులకు (39.61శాతం) ఎగుమతులు రూ.46,666 కోట్ల నుండి రూ.73,890 కోట్లకు (58.35శాతం) పెరిగాయని తెలిపారు. రాష్ట్రాల పనితీరు, నిధుల వినియోగ సామర్ధ్యం ఆధారంగా పారదర్శకంగా ఈ నిధులు కేటాయించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘పిఎంఎంఎస్పై మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం’ డిజిటల్ పోర్టల్ ద్వారా పనులను పర్యవేక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారునికి చేరువ చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు ఎలివి.రమణ ముదిరాజ్ స్పష్టం చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *