బయ్యారం,తెలంగాణ కానుక,జులై 30.
బయ్యారం మండలంలోని నామాలపాడు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను మండల ఎంపీడీవో దీపిక ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేస్తున్న వంటకాలను పరిశీలించారు.వంటకాలపై వార్డెన్ ను అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం ఆహారం అందిచడం,మౌళిక వసతులు తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అధ్యాపకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏకలవ్య ప్రిన్సిపల్ ధనరాజ్, అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.
