మణికొండ తెలంగాణ కానుక
నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాంపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి గా నియమితులైన సందర్భంగా జితేందర్ మెరుగు ను గురువారం సీనియర్ నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన 127, 128 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి అదేవిధంగా రాబోయే సైబరాబాద్ మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను ప్రతి కుటుంబానికి వివరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, సీనియర్ నాయకులు కిరణ్ కుమార్, యాలాల నరేష్, అహ్మద్ షా ఖాన్,ముత్యాలు, మల్లేష్, సావిత్రి, ఇందిర రెడ్డి, షేక్ హాజీ, కస్తూరి సతీష్, ఏ రాజు, మహేష్ రెడ్డి, మహేష్ బాబు ,పృథ్వీరాజ్, భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కుమార్, ఇమ్రాన్, రవికాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
