బయ్యారం,తెలంగాణ కానుక,జులై 30.
బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976-77 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాద్ లోని క్రితుంగ రెస్టారెంట్ లో గురువారం ఘనంగా నిర్వహించారు.దాదాపు 50 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.గురువారం బొందలపాటి రవి కుమార్ జన్మదినం సందర్బంగా రవి కుమార్ ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కొల్లా మన్మధరావు,వై.నాగేశ్వరావు,ఎండి వసీమ్,మట్టి వెంకటేశ్వర్లు,ఆర్ వీరభద్రం,ఎండి యుసాఫ్,ఎలమర్తి వెంకటేశ్వర్లు,బుక్క సత్యం,మొగిలిచర్ల వెంకటేశ్వర్లు,జి.వీరభద్రం,వివి నాయుడు,బొందలపాటి రవి కుమార్, ఎన్.ప్రసాద్,ఎస్.వెంకటేశ్వరరావు, కాజా రమణ,టీ.లీలా,ఎం.పద్మప్రియ,పద్మజ,వాసిరెడ్డి సులోచన,రామకృష్ణ రెడ్డి, పుట్టకుంట సత్యం, పావని నున్నా, వేములపల్లి స్వరూప,పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
