రాకెట్ శాస్త్రవేత్త గంధం లక్ష్మీనాథ్‌కు సన్మానం

Spread the love

చింతలపాలెం తెలంగాణ కానుక

చింతలపాలెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ల్లో స్కై రూట్ విక్రమ్-1 రాకెట్ శాస్త్రవేత్తల బృంద సభ్యుడైన గంధం లక్ష్మీనాథ్‌ను గురువారం ఘనంగా సన్మానించారు.
మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి, సీపీఐ జిల్లా నాయకుడు ఉస్తేల నారాయణరెడ్డి శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష విజయాలు సాధించి దేశానికి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.గంధం లక్ష్మీనాథ్ సాధించిన విజయాలు గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గోనె లక్ష్మీ అంకయ్య, చింతిరాల సురేందర్, టీజేఎస్ వెంకటరెడ్డి, అంబటి రాజశేఖర్ రెడ్డి, వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, గంధం కొండ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *