జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

Spread the love

హైదరాబాద్,తెలంగాణ కానుక

బెంగళూరులో ఆగస్టు 2వ తేదీన జరుగనున్న 14వ షోటోఖాన్ జాతీయ కరాటే పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి జివిఆర్ కరాటే అకాడమీకి చెందిన మొత్తం 24 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో 13 మంది బాలికలు, 11 మంది బాలురు ఉన్నారు. ఈ పోటీల్లో బ్లాక్ బెల్ట్ మరియు కలర్ బెల్ట్ విభాగాల్లో వివిధ వయసుల కేటగిరీలలో విద్యార్థులు పాల్గొనబోతున్నారు.

ఈ విషయాన్ని జివిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. గోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులను హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్ అభినందించారు.

ఆమె మాట్లాడుతూ, “దేశానికి విద్యార్థులే వెన్నెముక. విద్యార్థులు ఆటపాటల్లో ప్రావీణ్యం సాధిస్తే వారి బాల్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలకు చదువులతో పాటు ఆటలు కూడా అత్యంత అవసరం. నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజుల్లో బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యంత అవసరం. ఇటీవల బెంగళూరులో జరిగిన సంఘటనలు తిరిగి దేశంలో జరగకూడదు. అందుకే మహిళలు, బాలికలు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరిగా నేర్చుకోవాలి” అని చెప్పారు.

“మన తెలంగాణ రాష్ట్రానికి పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలుపుదాం.”

ఈ కార్యక్రమంలో వివేక్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ కృష్ణారెడ్డి, బ్లాక్ బెల్ట్ లు అమృత రెడ్డి, ఘన సంతోషనీ రెడ్డి, సుధాకర్, అనగ, అవిజ్ఞ వెంక రెడ్డి, ద్వైత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *