హైదరాబాద్ తెలంగాణ కానుక
రాష్ట్ర ప్రజల కు పౌర సేవలను మరింత వేవంతంగా సులభంగా అందే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక తీసుకుందని రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేసిన జీవో నెంబర్.172, ప్రకారం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని టీఎన్‌జీఓస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ అన్న పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వుల ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు ఒకే ధ్రువీకృత రికార్డులో అందుబాటులో ఉండటంతో, ప్రభుత్వ సేవలు పొందడంలో పారదర్శకత, సులభతరం అని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, వారసత్వ సంబంధిత వివరాలు, ఇతర అధికారిక అవసరాల కోసం ఒకే ధ్రువీకృత పత్రాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే సాధారణ ప్రజలకు కూడా కుటుంబ సభ్యుల వివరాల కోసం పలుమార్లు వివిధ ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా మీ సేవ కేంద్రాల ద్వారా త్వరితగతిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ ప్రజాహిత నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్‌జీఓస్ సెంట్రల్ యూనియన్ తరపున డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
