మక్తల్ తెలంగాణ కానుక
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూర్ కు చెందిన చాకలి నరేష్ ను ఇసుక తరలించే విషయంలో ధన్వాడ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా జిల్లా ఆస్పత్రిలో నరేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాసిన రిపోర్టులో పోలీసుల కొట్టడం వల్ల గాయాలైనట్లు పేర్కొనడం గమనార్హం.కాగా అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులో లేకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయగా, అక్కడ కూడా అందుబాటు లేకపోవడంతో హైదరాబాద్ కు తరలించాలని బాధితుని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు.ఈ దాడిని ఖండిస్తూ టి ఆర్ పి పార్టీ,తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మీదింటి శివవీర్ బాధితుడిని పరామర్శించి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
