తెలంగాణ కానుక,ఖానాపూర్.
ఇటీవల నిర్మల్ డిటిడివో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన.నిహారికను నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి,వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ కోల వసంత్,వైస్ ప్రెసిడెంట్ రవి,నాయకులు రమేష్,రవీందర్,సుభాష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
