రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి గ్రామంలోని నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగాయి.. ఈ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి, పూర్ణిమ భరత్ కుమార్ , ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యాతం అశోక్ యాదవ్ లతో కలిసి రథయాత్రను ప్రారంభించారు.
రథయాత్ర పాఠశాల నుండి బయలు దేరి..లక్ష్మమ్మ గుడి వరకు సాగింది…జగన్నాధుడు బలభద్రుడు,సుభద్ర ..అందమైన అలంకారాలతో…శోభాయమానంగా మేళతాళాలతో …వందల మంది విద్యార్ధులు ,తల్లిదండ్రులు, పురప్రముఖులు…ఉత్సాహం రథయాలో పాల్గొని భక్తిని చాటుకున్నారు…విద్యార్ధులు.. జగన్నాద్,బలభద్రుడు,సుభద్ర..దశావతారాలు..వేషధారణల తో అలరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నీరజ ఆధ్వర్యంలో
సుమారు రెండు వేల మందికి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉషారాణి కైరం కొండ వినోద్ కుమార్ మాజీ ఎంపిటిసి జల్లి సాయి రామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నార్సింగి తెలంగాణ కానుక..
