విద్యార్థుల హక్కుల కోసం కేటీఆర్ పోరాటం: ఇందిరా పార్క్ ధర్నాలో పోటెత్తిన బి ఆర్ ఎస్ వ శ్రేణులు,

Spread the love

విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత ధోరణికి వ్యతిరేకంగా, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పిలుపు మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరూ గొంతు విప్పాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాన్ని బీ ఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.
నార్సింగ్ సర్కిల్ నుండి భారీగా
నార్సింగ్ సర్కిల్ అధ్యక్షుడు కె. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… “విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కేటీఆర్ నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమానికి నార్సింగ్ సర్కిల్ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో నార్సింగ్ సర్కిల్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మైనారిటీ అధ్యక్షుడు షేక్ ముక్తార్, శ్రీనివాస్, గణేష్ ముదిరాజ్, పెద్దపులి కిషన్, గణేష్ రెడ్డి, మల్లేష్, చిరంజీవి, దాస్, శ్రీకాంత్ రెడ్డి, సంతోష్, మహేష్, జైసింహ, మహేందర్, ప్రకాష్, ఆసిఫ్, ఇమ్రోజ్, అరుణలతో పాటు మహిళా అధ్యక్షురాలు అనూష, మైనారిటీ అధ్యక్షురాలు బేగం తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

నార్సింగి తెలంగాణ కానుక…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *