గోరింటాకు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవి మాత.

Spread the love

ఆషాఢ మాసం రెండో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు – అన్నప్రసాద వితరణ, అనంతరం జోగులాంబ అమ్మవారి దర్శనం,

ఆషాఢ మాసం రెండో శుక్రవారం సందర్భంగా మహిళలు చేతులకు అలంకరించుకునే గోరింటాకుతో పెబ్బేరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని విశిష్టంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ అర్చకులు కిట్టు స్వామి తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం గోరింటాకుతో ప్రత్యేక అలంకరణ చేశారు.
మహా మంగళహారతి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
అనంతరం పట్టణ ఆర్యవైశ్య మహిళలు చిన్నమ్మవారి (ఉత్సవమూర్తి) ని కూడా గోరింటాకుతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గోరింటాకు ధరించి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు.
దాతలు ఇల్లూరి సత్యనారాయణ–సంధ్యారాణి దంపతులు, వారి కుమారుడు కార్తీక్ కుమార్, అలాగే నరహరి బుచ్చయ్య–స్వరాజ్యం దంపతుల సహకారంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
అనంతరం పట్టణ ఆర్యవైశ్య మహిళలు, పురుషులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పుణ్యక్షేత్రానికి వెళ్లి జోగులాంబ అమ్మవారికి పట్టుచీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *