పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
బీ ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం పోరెడ్డి ధర్మారెడ్డి ఎర్రోళ్ల యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను సంబరాలుగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రాష్ట్రంలో ప్రజా సమస్యలే దయంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బుద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సరికొండ దుర్గేష్, వీర్లపల్లి నవీన్ కుమార్ , బండ్ల నరేందర్, గిరిబాబు, ప్రవీణ్ ,నాగేష్, యాదగిరి, రాజు, వెంకటేష్ గౌడ్, నిష్కల్ రెడ్డి, విజయ్, హనుమాన్ జి, అకిరా నందన్, సునీల్ గౌడ్, ఎల్లయ్య, రాజిరెడ్డి ,నీరజ్ ,సతీష్,,అనుదీప్ రెడ్డి, నవదీప్, రవి కిరణ్, బాలు, ప్రదీప్, ప్రవీణ్ రాజ్ , శివ తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ తెలంగాణ కానుక
