శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి చేవెళ్ల కు బదిలీ. ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది నాయకులు.

Spread the love

శంషాబాద్. జూలై 24. తెలంగాణ కానుక.

శంషాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్గా దీర్ఘకాలంగా విధులు నిర్వహించిన నరేందర్ రెడ్డి చేవెళ్ల కు బదిలీ అయ్యారు . శుక్రవారం రిలీవ్ అయిన ఆయనకు పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందితోపాటు రాజకీయ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు . పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్న ఆయనను పలువురు కన్నీటితో వీడ్కోలు పలికారు. శంషాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెన్నం అశోక్, పెద్ద షాపూర్ సర్పంచ్ దేవులపల్లి సునీత సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్, సుజాత వెంకటేష్ గౌడ్, ముచ్చింతల సర్పంచ్ సుభాష్, హీరేకర్ శివాజీ, జిల్లా శ్రీనివాస్, నాగం గిరి ముదిరాజ్ తదితరులు ఆయనకు శాలువా పూలమాలతో సన్మానించి వీడ్కోలు పలికారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *