ఏన్కూరు కెనాల్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం
ఖమ్మం, జూలై – 24, తెలంగాణ కానుక ప్రతినిధి:
రాష్ట్రంలో నెలకొన్న ‘ఎల్ నినో’ తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల ఖమ్మం జిల్లా ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొకుండా ప్రజా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. భద్రాచలం వద్ద సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లాకు అందిస్తోందని ఆయన అన్నారు రెండు రోజులుగా నీటిని తరలిస్తున్న గోదావరి జలాలను డిప్యూటీ సీఎం భట్టి శుక్రవారం సాయంత్రం ఏన్కూర్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ రెడ్డిగూడెం వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఎల్ నినో ప్రభావం ఎంత ఉన్నప్పటికీ జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి దిశా నిర్దేశం దిశానిర్దేశం చేశారు
ఏన్కూర్ రెగ్యులేటర్ వద్ద నాగార్జునసాగర్ NSP ఎన్ ఎస్పి కాలువలోకి సీతారామ ఎత్తిపోతల పథకం నీటి పంపిణీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది సీతారామ ప్రాజెక్టు నుంచి సుమారు 1,500 క్యూసెక్కుల గోదావరి నీటిని ఏన్కూర్ రెగ్యులేటర్ వద్దకు తీసుకువచ్చి అక్కడి నుంచి ఎన్ఎస్పీ కాలువ ద్వారా పలు చెరువులకు ప్రాజెక్టులకు నీటిని తరలింపు జరుగుతోంది
ఏన్కూర్ రెగ్యులేటర్ నుంచి ఎన్ఎస్పీ కాలువ ద్వారా దిగువ వైపునకు 1,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది ఈ నీరు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకా సాగర్ ప్రాజెక్టు వరకు వెళుతుంది
రెగ్యులేటర్ నుంచి ఎన్ఎస్పీ కాలువ ద్వారా పైభాగంలో ఉన్న ప్రాంతాలకు 500 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు ఇందులో 250 క్యూసెక్కుల నీటిని వైరా రిజర్వాయర్‌కు మళ్లించడం జరుగుతోంది మిగిలిన 250 క్యూసెక్కుల నీటిని పరిధిలోని చెరువులకు విడుదల చేస్తున్నారు
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
