తెలంగాణలోని ప్రముఖ స్వయంప్రతిపత్తి ఇంజినీరింగ్ విద్యాసంస్థ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , హైదరాబాద్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీ జీ ఈఏ పీ సెట్–2026 తొలి విడత కౌన్సెలింగ్‌లో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ర్యాంక్–1 సాధించిన విద్యార్థిని కుమారి ఎమ్ ఋషి సీ బీ ఐ టీ లో సిఎస్ఈ విభాగం లో చేరటం సంస్థకు తన కు ఎంతో సంతోషంగా వున్నదిని ఒక ప్రకటలో తెలిపారు.
ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విశిష్ట విజయానికి సీ బీ ఐ టీ యాజమాన్యం అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.వి. నరసింహులు దూరదృష్టి కలిగిన డైనమిక్ నాయకత్వం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, అంకితభావంతో పనిచేస్తున్న అధ్యాపక బృందం, అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన బోధన–శిక్షణ, వినూత్న పరిశోధనలకు ప్రాధాన్యం, అత్యుత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలు మరియు విలువల ఆధారిత విద్య ప్రధాన కారణాలని పేర్కొంది.
దేశంలోని ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు, పరిశ్రమలతో అనుసంధానమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలకు ప్రోత్సాహం, స్టార్టప్ సంస్కృతికి మద్దతు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన విద్యా విధానాలు సిబిఐటి ను విద్యార్థుల తొలి ఎంపికగా నిలబెడుతున్నాయని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులు సిబిఐటి ను ఎంపిక చేసుకోవడం ద్వారా సంస్థ విద్యా ప్రమాణాలు, నాణ్యత, విశ్వసనీయత మరింత బలపడుతున్నాయని యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు, విద్యార్థులు సంస్థపై ఉంచుతున్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొంది.
హైదరాబాద్ తెలంగాణ కానుక.
