రైతులకు బీ ఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,

Spread the love

శంషాబాద్ తెలంగాణ కానుక

బహదూర్ గూడ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి చేవెళ్ల శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం బహదూర్ గూడ గ్రామంలో బాధిత రైతులను రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తో కలిసి ఆమె పరామర్శించారు. గ్రామానికి విచ్చేసిన సబితా ఇంద్రారెడ్డి ని గ్రామస్తులు చుట్టుముట్టి తమ గోడు వెల్లబోసుకున్నారు. బాధతో విలపిస్తున్న రైతులను ఆమె ఓదార్చారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో పేదల భూములను లాక్కోవడం ఏమాత్రం సరి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరో రెండు సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రెండు నెలల్లోనే బహదూర్ గూడ రైతులకు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని సబితా ఇంద్రారెడ్డి వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భూములు అప్పగించకుండా రైతులు పోరాటం చేయాలని రైతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతుల పోరాటానికి అండగా ఉండాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆమె సూచించారు. రైతుల సంతోషం కోసం బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, మాజీ ఎంపీపీ ఏనుగు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బుర్కుంట సతీష్ , కొత్వాల్ గూడ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కోనమల శ్రీనివాస్ . శంషాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొలను ప్రదీప్ రెడ్డి, మండల అధ్యక్షుడు మంచెర్ల మోహన్ రావు, మంచర్ల శ్రీనివాస్, జొన్నాడ రాఘవేందర్, మడపతి పరమేశ్వరి నరేందర్, దీప మల్లేష్ ముదిరాజ్, యుగంధర్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజేందర్, గుంటి చరణ్, కొమ్మూరి విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *