కార్పొరేషన్పదవుల్లో శ్రీ వైష్ణవులకు ప్రాధాన్యం కల్పించాలి,

Spread the love

హైద్రాబాద్ తెలంగాణ కానుక

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివర్లో భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్,మరియు డైరెక్టర్స్ పదవులలో “శ్రీ వైష్ణవ” అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించి,తగు న్యాయం చేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి,శ్రీ వైష్ణవసేవా రాష్ట్ర సంఘం పక్షాన వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు
తిరువరంగం ప్రభాకర్ మెసల్లడుతూ
బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులను రెండింటిని వైదికుల
(బ్రాహ్మణుల) చేతనే భర్తీ చేయడం ద్వారా
“ శ్రీ వైష్ణవులకు “ తీవ్ర అన్యాయం జరిగిందని టిలిపారు.బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్స్ నియామకాలు ఈ నెల చివరిలో భర్తీ చేసే సందర్భం లో కనీసం 5 డైరెక్టర్స్ పదవులను “ శ్రీ వైష్ణవులకు “ కేటాయించాలని డిమాండ్ చేశారు.
వైష్ణవ ఆలయాలలో నిత్యం అనుసరించే
వైష్ణవ ఆగమం గూర్చి సంపూర్ణంగా అవగాహన కలిగిన శ్రీ వైష్ణవులను పాలకవర్గ సభ్యులుగా నియమించడం ద్వారా,సదరు ఆలయాలలో పూజాది కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లో సుదీర్గ కాలంగా సేవ చేస్తున్న శ్రీనివాసా చారికి తగు అవకాశం ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ,రాష్ట్ర బాధ్యులు సుదర్శనా చార్యులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *