అంగరంగ వైభవంగా జగన్నాథుడి రథయాత్రపాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,

Spread the love

నార్సింగి తెలంగాణ కానుక

నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ లో ని హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఆదివారం జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భగవంతుడు స్వయంగా భక్తుల వద్దకు వస్తాడని నమ్మకంతో రథయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జగన్నాథ స్వామిని అలంకరించిన రథాలు ఊరేగిస్తూ జై జగన్నాథ నినాదాలతో పెద్ద మొత్తంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, జగన్నాథ స్వామివారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం, పాడి పరిశ్రమతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా, సుభిక్షంగా ఉండాలని నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు జగన్నాథ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి,టిపిసిసి అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ యాదవ్, నార్సింగ్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గోపాల విజయ్ బాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *