భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కె.ఎల్ ఆర్ కు సూచన
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు భూమిపూజ
మూసీ ప్రక్షాళనతో కాలుష్యం తగ్గుతుంది: కిచ్చెన్న భారత్ ఫ్యూచర్ సిటీ కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతుల రుణం తీర్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కోసం భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న రైతులకు నష్టపరిహారం విషయంలో వెనక్కి పోకుండా భూమికి పరిహారంతోపాటు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కేఎల్ఆర్ కు సూచించారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కిచ్చెన్న మాట్లాడుతూ… అమెజాన్ డేటా సెంటర్ కోసం 202 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లల్లో పూర్తి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పారు.అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో పరిశ్రమలు, ఏఐ ఆధారిత స్టార్టప్స్ వేగం పుంజుకుంటుందని కేఎల్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాల ప్రకారం ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కిచ్చెన్నగారు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళనతో హైదరాబాద్ లో కాలుష్యం తగ్గుతుందన్నారు.
మహేశ్వరం తెలంగాణ కానుక
