- గ్రంథాలయం ప్రారంభించిన గ్రంధాల సంస్థల జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డి
- సర్పంచ్ ఎన్ఎన్ఆర్
ఆమనగల్లు తెలంగాణ కానుక
ఆమనగల్లు మండల పరిధిలో ని ఆకుతోట పల్లి గ్రామంలో ఆదివారం నూతన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ. మధుసూదన్ రెడ్డి,స్థానిక సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుకున్న యువతీ యువకులు నిరుద్యోగులకు పోటీ ప్రపంచంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.గ్రంథాలయాలు ఆలోచనా విధానం జ్ఞానం పెంపొందించుకునేందుకు దోహదపడుతాయన్నారు. పుస్తకాలు చదవడం రాయడం ఎంతో లాభదాయకమన్నారు.రాబోవు తరాలకు మంచి నైపుణ్యం విద్యనందించేందుకు ఎంతో ఉపయోగపడుతాయని విద్యార్థులు గ్రంధాలయాలను వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా కార్యదర్శి రాణి, ఉప సర్పంచ్ శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,శివలింగం,గ్రామ వార్డు సభ్యులు మహేష్ సురేష్ నాయక్,కొండల్ రెడ్డి, రాజు, విజయ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
