హైదరాబాద్, తెలంగాణ కానుక
తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి భూతమిచ్చేలా అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కిన్ మనుప్యాక్చరర్స్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన గురువారం హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించనున్న ప్రపంచ మిఠాయి 19వ సదస్సు ప్రాంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ఫిరోజ్ నక్వి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బుధవారం సీఎంను ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎన్ఎం ప్రతినిధులు జస్మత్ పటేల్, రితీష్ జాగిర్దార్, అఫ్తాబ్ జైదీ, నీలేష్, విపుల్, ముఖేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
