న్యాయవాదుల సొసైటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: గుర్రాల వినోద్ కుమార్,

Spread the love

న్యాయవాదుల సొసైటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన 3 స్టార్ ఫైనాన్స్ కార్పొరేషన్ హనుమకొండ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్

యునైటెడ్ వరంగల్ అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ నూతన పాలకవర్గానికి 3 స్టార్ ఫైనాన్స్ కార్పొరేషన్ హనుమకొండ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉప్పు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు చెన్నూరి రమేష్, కార్యదర్శి కిరణ్ సింగ్, కోశాధికారి బి. కవితతో పాటు పాలకవర్గ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా 3 స్టార్ ఫైనాన్స్ కార్పొరేషన్ హనుమకొండ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నూతన కమిటీ న్యాయవాదుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకొని, సొసైటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. న్యాయవాదుల సంక్షేమంతో పాటు సొసైటీని విజయపథంలో నడిపించాలని,
నూతన పాలకవర్గం న్యాయవాదుల సంక్షేమం, సొసైటీ అభివృద్ధిలో విశిష్ట సేవలు అందించాలని గుర్రాల వినోద్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుభాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *