14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు,

Spread the love

హైద్రాబాద్ తెలంగాణ కానుక

14న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బషీర్బాగ్ నగర శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిజాం కళాశాలలో మీడియా సమావేశం లో ఏబీవీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్ విక్రమాదిత్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.11 వేల కోట్ల స్కాలర్షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్ టి ఎఫ్,ఎం టి ఎఫ్ నిధులు విద్యార్థుల ఖాతాల్లో జమ కాకపోవడంతో ఉన్నత విద్య కొనసాగించడం అనేక మంది విద్యార్థులకు భారంగా మారిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల హక్కుల సాధన కోసం జూలై 14న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చిందని విక్రమాదిత్య తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఆర్ టి ఎఫ్ ఎం టి ఎఫ్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ ఎస్ ఎఫ్ ఎస్ కో-కన్వీనర్ సుప్రజ్, నగర కార్యదర్శి సురేందర్, కళాశాల కార్యదర్శి విష్ణు, నగర కన్వీనర్ రాహుల్, రఘునందన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *