విజయనగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన షాపుల సీజ్ …..

Spread the love

మెహిది పట్నం: మర్చి 17 తెలంగాణ కానుక

జిహెచ్ఎంసి మాసాబ్ ట్యాంక్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మించిన షాపులను సీజ్ చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమంగా నిర్మాణం చేసిన షాపులకు సీల్ వేశారు. విజయనగర్ కాలనీ ప్రధాన రహదారి లో కింగ్ చాట్ బండార్ వద్ద అక్రమంగా షాపులు నిర్మించారు. స్థలం తమదని ఒకరు..మరొకరు ఏకంగా ఆ స్థలంలో నిర్మాణాలు చేయటంతో ఇద్దరి మధ్య గొడవ ఫిర్యాధుల నేపథ్యంలో జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు.
ఇక ముందు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సీరియస్ చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ సీజింగ్ ప్రక్రియ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *