నిందితుడికి 14 రోజుల రిమాండ్…….
ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న స్టార్ తాబేలును రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం రావడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అడ్డగుట్టకు చెందిన సురేష్ కుమార్ (32) అనే ప్రయాణికుడు భువనగిరి నుంచి సికింద్రాబాద్‌కు వస్తూన్నప్పుడు తనిఖీలలో భాగంగా తను తాబేలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని RPF పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తరువాత ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వారు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు..న్యాయస్థానం నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు హైద్రాబాద్ డీఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపారు..
