జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలను అడుగడుగునా అవమానిస్తూ, ఆత్మగౌరవాన్ని, ధెబ్బతీస్తు బీసీల ద్రోహిగా మారి, కులగజ్జితో వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు
టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను తొలగించి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం చూస్తే బీసీలపై ఆయనకు బిసిల పట్ల పచ్చి వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టం అవుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు
