దేశీ కుక్కపిల్లల దత్తతకు నగర ప్రజలు ముందుకు రావాలి:మంత్రులు సీతక్క, కొండా సురేఖ.

Spread the love

దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని
మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి లు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బి ఎ హీరో ,దత్తత తీసుకోండి, షాపింగ్ వద్దు ( ” Be a Hero. Adopt, Don’t Shop”) నినాదంతో బంజారా హిల్స్ కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కులో శనివారం ఉదయం నుండి కుక్కపిల్లల దత్తత మేళా జీహెచ్ఎంసి నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరిలు విచ్చేసి ఈ మేళాను ప్రారంభించారు.
దత్తతకు వీలుగా ప్రదర్శనలో వచ్చిన పప్పీలను పరిశీలించారు. దత్తతకు ముందుకు వచ్చిన వ్యక్తులకు పప్పి లను అందించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
పూర్వ కాలం నుండి ప్రజలకు కుక్కలు నమ్మకమైన మిత్రులుగా ఉంటూ వస్తున్నాయని అన్నారు.
అలాంటి కుక్క పిల్లలు వీధుల్లో ఉండకుండా చూడాలంటే వాటిని ప్రజలు దత్తత తీసుకుని తమ ఇంటిలో చోటివాలన్నారు. దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా, ఫ్రెండ్ లా ఆదరించాలని చెప్పారు. యజమానులు కుక్క పిల్లలకు
వ్యాక్సినేసిన్, స్టెరీలైజేషన్ చేపించాలని చెప్పారు. ఇండీ కుక్కపిల్లల దత్తత మేళా లను జీహెచ్ఎంసి నిర్వహించడం అభినందనీయమని ఇలాంటివి విరివిగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల,
జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్‌, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *