రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఆప్కో కాలనీలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడం తో వెంటనే స్పందించిన నరేష్ యాదవ్ సంబంధిత అధికారులతో చర్చించి శనివారం సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా బస్తి వాసులందరూ నరేష్ యాదవ్ ను అభినందించారు రాబోయే రోజుల్లో జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇస్తే సమిష్టి కృషితో నరేష్ యాదవ్ ను గెలిపిస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి: నరేష్ యాదవ్.
