బెల్లంపల్లిలో బీఆర్ఎస్‌కు మరింత బలం: పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు.

Spread the love

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.

వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి పార్టీలో అధికారికంగా చేరనప్పటికీ, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *