అభాగ్యుల గూడు కోసం పేదల పెన్నిధి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మానవత్వం చాటుకున్నారు.
జిహెచ్ఎంసి పరిధి నాదర్ గుల్ డివిజన్ పరిధిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.
నాదర్ గుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని ఈ సందర్భంగా సందర్శించారు. మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వారిని, అభాగ్యులను చేరదీస్తున్న ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరిని అభినందించారు. నూతన భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి రూ. 10లక్షల భవన నిర్మాణానికి మెటీరియల్ ఇస్తామని ఛైర్మన్ లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారు చెప్పటంతో నాదర్ గుల్ కాంగ్రెస్ నేతలు, అనాధాశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
పేదలకు పండ్లు పంపిణీ చేసిన తన జీవితాంతం బడుగు, బలహీన వర్గాలు, పేదలు, అభాగ్యులకు సేవ చేసేందుకే ట్రస్ట్ స్థాపించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాదర్ గుల్ డివిజన్ నాయకులు, ఆశ్రమ నిర్వాహకులు, అభాగ్యులు, స్థానికులు పాల్గొని లక్ష్మారెడ్డికి ఘన స్వాగతం పలికారు.
మాతృదేవోభవ అనాధశ్రమానికి కె.ఎల్.ఆర్ చేయూతఅభాగ్యుల గూడు కోసం రూ.10 లక్షల విరాళం.
