సమ్మక్క సారక్క వారసులారా ములుగులో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి:ఈటల రాజేందర్.

Spread the love

చరిత, సంపత్, మాధవి, సంధ్యారాణి, రాధిక, రాకేష్ యాదవ్, ఎల్కతుర్తి శివ, సునీత, మౌనిక, స్వామి, వంశీ, బిక్షపతి, చుంచు రవి, లక్ష్మీభవాని, రమ, విశ్వనాథ్, శ్రీహరి, శైలజ, భాస్కర్ రెడ్డి, సురేంద్రలను కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ

వెనకటి లెక్క మనం అమాయకులం కాదు.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇంతమందిని చూశాను. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా అధికారప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తారు. కానీ ఓట్లు వేసి గెలిపించేది అధికారులు కాదు ప్రజలు అని గుర్తుపెట్టుకోవాలి.
ప్రజలే కథానాయకులు అవుతారు.

అహంకారం ఎక్కువై ప్రజలను మర్చిపోతే ఓడించి గుర్తుచేసేది ప్రజలే.
రేవంత్ రెడ్డి నువ్వు కూడా గుణపాఠం తెచ్చుకో.. ముఖ్యమంత్రి కేసీఆర్ని బండకేసి కొట్టిన ప్రజలు మీకు కూడా అదే బుద్ధి చెప్తారు.

BRS పార్టీ చతికల పడింది ఊసే లేకుండా పోతుంది. అక్కడ ఇక్కడ లేని పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వం పోయాక ఏం చేయలేక రెండు సంవత్సరాల రెండు నెలలుగా కేసీఆర్ ఫాం హౌస్ కి పరిమితమయ్యారు వారి కౌన్సిలర్స్ ను గెలిపిస్తే వాళ్లేం చేయగలరు.

BRS కి ఓటు వేస్తే మురికిగుంటలో ఓటు వేసినట్టే.

అనేక మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్క హామీ అమలు చెయ్యడం లేదు.
కాలేజీ పిల్లలకు నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు.
నన్ను కోసినా రూపాయి లేదు అనే రేవంత్ రెడ్డి పార్టీ వాళ్లను గెలిపిస్తే ఎలా అభివృద్ధి చేస్తారు.

డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం బీజేపీకి వేయండి.

ములుగు గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విద్యాలయం కేంద్రం ఇచ్చింది.

రామప్ప వారసత్వ సంపదగా గుర్తించి 140 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం.

మేడారం జాతరకు 40 కోట్లు ఇచ్చి గౌరవించింది మోడీ గారి ప్రభుత్వం.

సఫాయి కార్మికులకు జీతం కూడా కేంద్రమే ఇస్తున్నది.

కేంద్రం ఇందులో ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం గిలగిలా కొట్టుకుంటుంది.

కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ స్మార్ట్ సిటీ కింద అభివృద్ధి చేసే సత్తా మాకు మాత్రమే ఉంటుంది.

నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి చెందుతుంది.

బిజెపి వస్తేనే కుటుంబ పాలన మళ్లీ రాదు, దోపిడీ పాలన అంతమవుతుంది.

టౌన్ అధ్యక్షులు నాగరాజు, ములుగు జిల్లా బిజెపి అధ్యక్షుడు బలరాం, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్రావు, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరరావు, ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ నరేష్.
భాస్కర్ రెడ్డి జవహర్ నాయక్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *