బీ ఆర్ఎస్ రోడ్ షో గ్రాండ్ సక్షేస్.

Spread the love

సూర్యాపేట పట్టణంలో బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ప్రజార్యాలీతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో కోర్ట్ చౌరస్తా, పూల సెంటర్, పి ఎస్ ఆర్ చౌరస్తా, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్, గాంధీ విగ్రహం, కొత్త బస్టాండ్ వద్దకు మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ దండుతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించరు మరోసారి కాంగ్రెస్ కు ఓటేస్తే.. మరింత గోసపడతం..
కెసిఆర్ అన్నట్టుగానే మళ్లీ 2014 కు ముందు రోజులోచ్చినయ్..
రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో మీకేం లాభం జరిగిందో ఆలోచన చేయండి..సీఎం ఆయన మంత్రి వర్గమంతా దోచుకునే పనిలో పడ్డరు..మంత్రుల మధ్య సఖ్యత లేక ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకుంటున్నరు..
వాళ్ళల్లో పంపకాల పంచాయితే కాదు.. రాసలీలల పంచాయితీలు పెట్టుకోవడం మరీ నీచం.. ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారుల పై కూడా అబండాలు వేస్తున్నారు..
అడ్డు ఆడుపూ లేని అరాచకాలతో రాక్షసానందం పొందుతున్నారు..
సూర్యాపేటకు మంజూరైనా నిధులు వెనక్కి పంపిన దుర్మారం కాంగ్రేస్ ది..స్పోట్స్ స్కూల్, స్టేడియం ఆడునీకరణకు 25 కోట్లు..మహిళా పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాలకు 25 కోట్లు..భానుపూరి కళా భారతి ఏర్పాటుకు 50 కోట్లు..
సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 50 కోట్లు..స్కిల్ డెవలప్మెంట్ కు 25 కోట్లు..ఇలా కోట్లాది రూపాయలను వెనక్కి పంపిన పాపం కాంగ్రెస్ ది..ప్రజల పట్ల అభివృద్ధి పట్ల కాంగ్రెసోల్లకు ఎంత సోయి ఉందో అర్ధమవుతుంది..
మార్పు తెస్తామన్న కాంగ్రేస్ 2014 కు ముందున్న మూడు మాత్రం తెచ్చింది..
వాళ్లు పెంచిపోసించేది దోమలు, పందులు, రౌడీయిజమే..
6 గ్యారంటీలు, 420 హామీలు అమలవుతాయానే నమ్మకం పోయింది..
అరాచక కాంగ్రెస్ ను నమ్మి అభివృద్ధి చేసే కెసిఆర్ ను వదులుకున్నరు.
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఒరిగిందేమి లేదని తెలుసుకున్నరు..
కాంగ్రెస్ అంటే కరువు, కష్టాలే అని ప్రజలకు అర్థమైంది..
అభివృద్ధి కుంటుపడింది.. కనీసం చెట్లకు నీళ్లుపొసే దిక్కులేదు..
అరాచక కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి..

మరోమారు మోసపోకుండా ఓటు అనే ఆయుధంతో సరైన సమాధానం చెప్పాలని అన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *