ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణం పట్ల ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆమె మరణం శాఖకు తీరని లోటని పేర్కొంటూ ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
విధి నిర్వహణలో సౌమ్య ప్రదర్శించిన నిబద్ధత, అంకితభావం ఎంతో గొప్పవని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. ఆమెను కోల్పోవడం బాధాకరమన్నారు.
సౌమ్య త్యాగం మరువలేనిదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టడానికి మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
