వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ మరియు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించబడింది. ఈ సంవత్సరం థీమ్ “యునైటెడ్ బై యూనిక్యూ ”
నిమ్స్ బంజారాహిల్స్ ప్రాంగణం నుండి పంజాగుట్ట గేట్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భీరప్ప నగరి ప్రారంభించారు. విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లెర్నింగ్ సెంటర్‌లో జరిగిన అవగాహన సభలో డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక క్యాన్సర్ నిర్ధారణ, టార్గెటెడ్ థెరపీ మరియు చికిత్సా సదుపాయాలను వివరించారు.
డాక్టర్ సదశివుడు గుండేటి ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్ నయం అయ్యే అవకాశాలపై వివరించారు.
డాక్టర్ సత్యనారాయణ క్యాన్సర్ సేవల్లో సౌకర్యాల మెరుగుదలపై మాట్లాడారు.
డాక్టర్ శాంతివీర్ జీ ఉప్పిన ఉచిత ఆంకో-పాథాలజీ పరీక్షలపై తెలిపారు.
డాక్టర్. రంగనాథ్ ఆర్ రోబోటిక్ సర్జరీ సదుపాయాలపై వివరించారు.
డాక్టర్ మౌకా మాలిక్ ఇరుకుల్లా ఆధునిక రేడియేషన్ యంత్రం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పారలల్‌గా నిర్వహించిన ఉచిత స్క్రీనింగ్ శిబిరంలో బ్రెస్ట్, సర్వికల్, హెడ్ & నెక్ క్యాన్సర్లకు పరీక్షలు నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా నమోదు చేసుకోగా, 130 పాప్ స్మియర్ పరీక్షలు డాక్టర్ . రాధికా ఆధ్వర్యంలో, 100 మామోగ్రఫీ పరీక్షలు రేడియాలజీ విభాగం ద్వారా నిర్వహించబడ్డాయి. క్యాన్సర్ లక్షణాలు, ముందస్తు గుర్తింపుపై హ్యాండౌట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమ నిర్వహణలో పీబీసీఆర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీహరి ఉప్పలపాటి వారి బృందం విశేష సహకారం అందించారు.
ముందస్తు గుర్తింపు, క్యాన్సర్ నివారణ, ప్రజల్లో అవగాహన, అందుబాటు స్క్రీనింగ్ సేవల ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా నిమ్స్ మరోసారి చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
