హైదరాబాద్ పరిధిలో నాణ్యత లేని, ఆరోగ్యానికి హానికరమైన ఆహారం విక్రయమవుతున్నా సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్లాట్‌ఫారం 65 హోటల్‌పై తీవ్రమైన ఆరోపణలు
ఆకర్షణీయమైన కాన్సెప్ట్‌తో ప్రజలను ఆకట్టుకుంటున్న ప్లాట్‌ఫారం 65 హోటల్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
సమాచారం ప్రకారం, ఈ హోటల్‌లో ఉడికి ఉడకని ఆహారం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఫైవ్ స్టార్ ముసుగులో నిర్లక్ష్యం
ఫైవ్ స్టార్ స్థాయి పేర్లతో నడుస్తున్న హోటళ్లలో కూడా కనీస ఆహార ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫిర్యాదులపై దౌర్జన్య వైఖరి
లోపాలపై ఫిర్యాదు చేసిన వినియోగదారులకు “మీ దిక్కున కాడ ఫిర్యాదు చేసుకోండి” అంటూ బాధ్యతారాహిత్య సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
అధికారుల మౌనంపై అనుమానాలు
స్పష్టమైన ఫిర్యాదులు ఉన్నా ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనుక ఎవరి అండదండలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజల ఆరోగ్యంపై రాజీ వద్దు
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటళ్లపై తక్షణమే తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
