నాంపల్లి ప్రమాదం.. సకాలంలో స్పందించిన జలమండలి.

Spread the love

శనివారం నాంపల్లిలో ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కి వచ్చిన సమాచారాన్ని వాళ్ళు.. జల మండలి ప్రధాన కార్యాలయానికి వాటర్ ట్యాంకర్లు కోసం సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించి రెడ్ హిల్స్ డివిజన్ 4 జీఎంను అప్రమత్తం చెయ్యడంతో… ఇప్పటివరకు రెడ్ హిల్స్, బొగ్గుల కుంట ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రస్తుతం 5 ట్యాంకర్లతో 12 డ్రిప్పులు సరఫరా చేశారు.. ఇంకా మరికొన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

ఘటన స్థలంలో ఇద్దరు మేనేజర్లు పోలీస్, ఫైర్ అధికారులతో సమన్వయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

సకాలంలో స్పందించిన జీఎం, మేనేజర్లను జలమండలి సిబ్బంది, అధికారులను ఎండీ అశోక్ రెడ్డి అభినందించారు.

అలాగే లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయంతో మంటలు అదుపులోకి వచ్చేంతవరకు ట్యాంకర్ల లతో నీటి సరఫరా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *