అధికారుల పనితీరు భేష్,కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Spread the love

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పని చేసిన అధికారులను,సిబ్బందిని అందరినీ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అభినందించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,,, ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో తమకు కేటాయించిన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించి విజయవంతంగా నిర్వహించారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం,ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా కింది స్థాయి నుండి పై అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో నిబద్దతతో పని చేయడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు.ఎన్నికలలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అభినందించారు.రాబోయే ఎన్నికలలో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుటకు జిల్లా కలెక్టర్ గారు ముందుండి దిశానిర్దేశం చేయడం వలనే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి విజయవంతం అయ్యేలా చేయడం జరిగినదని ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి,శ్రీనివాస్,డీఆర్ఓ సంగీత,జెడ్పీ సిఇఓ కృష్ణారెడ్డి,డిపిఓ సురేశ్ మోహన్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, ఎంపిఒలు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *