30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లకు ప్రమాద రహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఈడి లు అధికారులు
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు -2026 ప్రారంభించుకున్నాం
గతంలో వారోత్సవాలు ఉండేవి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రాముఖ్యత గా తీసుకొని నెల రోజుల పాటు రోడ్డు భద్రత పై అవగాహన చేయాలని కార్యక్రమాన్ని తీసుకుంది..
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమం
రవాణా శాఖ ,ఆర్టీసీ మాత్రమే కాదు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కు ,పోలీస్ అధికారులు , విద్యా శాఖ , ఆర్ అండ్ బి అన్ని విభాగాల అధికారులు సమన్వయం తో కార్యక్రమం నడుస్తుంది
రవాణా శాఖ విద్యార్థులకు ఒక అప్లికేషన్ ఇస్తుంది..
విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర రోడ్డు నిబంధనలు పాటిస్తాం.. అతి వేగం , డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని వారి సంతకంతో అఫిడవిట్ తీసుకొని ప్రభుత్వానికి తీసుకుంటున్నాం..
రోడ్డు భద్రత పై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం
రవాణా శాఖ అధికారులు 1000 ఉంటే రాష్ట్రంలో కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయి..అందుకే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి
రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు జీవితాంతం బాధ పడుతున్నాయి..
ప్రమాదాలను తగ్గించడానికి ఇతరులకు ఆర్టీసీ ఆదర్శంగా ఉండాలి
20 వేల డ్రైవర్లు ,10 వేల బస్సులు 60 లక్షల ప్రయాణికులు , 39 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ మన లైఫ్ లైన్..
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటాం..
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఉద్యోగుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యం మన లక్ష్యం..
260 కోట్ల మంది ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేశారు 8800 కోట్ల రూపాయలు ఆదా మనకు ఆదాయం..
ఆర్టీసీ మూసేస్తామని పరిస్థితి నుండి అన్ని డిపో లకు లాభాల్లోకి వస్తున్నాయి
కోటి కిలోమీటర్లకు ఒక ప్రమాదం జరుగుతుంది..
ఆర్టీసీ ప్రమాదాలను జీరో స్థాయికి తగ్గించాలి..
చలెగ బస్ క పయ్య .. హర్ గావ్ కి చలేగ బస్ క పయ్య
ఇప్పుడు నగరంలో 326 రూట్లలో కొత్తగా ఆర్టీసీ బస్సులు నడుపుతుంది..
గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ బస్సులు అవసరం ఉన్నాయో మీరు రీప్రజెంటేషన్ ఇవ్వండి..అక్కడికి బస్సులు నడిపిస్తుంది..
ఆర్టీసీ రాష్ట్రంలోని నలుమూలల బస్సులు నడిపిస్తాం
రోడ్ సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి..
కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి,మంత్రులు ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం..
రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు ,శాశ్వత వికలాంగులు అయిన కుటుంబాలు దుర్భరంగా ఉన్నాయి..
వెహికిల్ ఫిట్నెస్ ఉండాల్సిందే.. ఫిట్నెస్ ఉంటేనే బస్సులు రోడ్డెక్కించాలి..
రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు అవగాహన కల్పించాలి.. ఆర్టీసీ అగ్రభాగాన నిలబడి ప్రధాన పాత్ర పోషించాలి..
ఆర్టీసీ కుటుంబాలు అంత 2026 లో పాత బకాయిలు అన్ని పోయి మనం ముందుకు పోవాలి
మరింత శ్రమ పడదాం..బంగారు భవిషత్ ఉండాలి..
తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు మన పాత్ర ఉండాలి..
