రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నది కోమటిరెడ్డి.

Spread the love

రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి అని,తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారనీ ఆర్ అండ్ బి అధికారులకు కితాబిచ్చారు.

2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం నాడు ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ అండ్ బి ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని శాఖ ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఉద్యోగులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,కిషన్ రావు,బి.వి రావు,లింగారెడ్డి, వసంత్ నాయక్,నర్సింగ్ రావు,పలువురు ఎస్.ఈ లు,ఈ.ఈ లు ఇంజనీర్లు,ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్..కార్యవర్గ సభ్యులు,ఆర్ అండ్ బి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *