వైభవంగా బంగారు మైసమ్మ బోనాల వేడుకలు

Spread the love

ప్రత్యేక పూజలు పాల్గొన్న డాక్టర్ ఎస్ఎం హుస్సేనీ ముజీబ్

హైదరాబాద్ తెలంగాణ కానుక

హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో టీ.ఎన్.జి.ఓస్ యూనియన్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ యూనిట్ అధ్యక్షులు శ్రీ కేసరి హనుమాన్, కార్యదర్శి అబ్దుల్ అజీజ్, చీఫ్ లైబ్రేరియన్ పీ.జి.వి.రాణి ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి టీ.ఎన్.జి.ఓస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఉద్యోగులంతా ఐక్యంగా నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీ.ఎన్.జి.ఓస్ యూనియన్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ యూనిట్ అధ్యక్షులు కేసరి హనుమాన్, కార్యదర్శి అబ్దుల్ అజీజ్, చీఫ్ లైబ్రేరియన్ పి.జి. వి.రాణిలు ముఖ్య అతిథి హాజరైన డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో టీ.ఎన్.జి.ఓస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు బొలిగిద్ద శంకర్, ప్రచార కార్యదర్శి వైదిక్ శాస్త్ర, ఈసీ సభ్యులు ముకీద్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ యూనిట్ ఉపాధ్యక్షురాలు సి. అపర్ణ (గెజిటెడ్ లైబ్రేరియన్), సంయుక్త కార్యదర్శి రాకేష్, సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీకాంత్ పాల్గొన్నారు.

రమ్య, అనిత, రవి, ఉమా మహేశ్వర్ రెడ్డి, విక్రమ్, మహేష్, దీక్షిత్, నరేందర్, అబ్దుల్ అతర్తో పాటు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సిబ్బంది, ఉద్యోగులు, రంగారెడ్డి జిల్లా జీజీఎస్, సీజీఎస్ ప్రతినిధులు మరియు పలువురు ఉద్యోగులు అమ్మవారిని దర్శించుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *